Skip to main content

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా నాలుగో నగరం

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 

ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు.

కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్,  ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. 

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు.

🔹 ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది.

🔹 ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది. 

🔹 న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం.
 
🔹 ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలును విస్తరించడం, ఆ తర్వాత దాన్ని నెట్‌ జీరో సిటీ వరకు పొడగించడం.

🔹 ఆ ప్రాంతం వరకు 200 అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించడం. 

🔹 వచ్చే మూడు నెలల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టడం.

🔹 స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే కచ్చితంగా ఉద్యోగం లభించే ప్రణాళికలు.

🔹 నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్‌ సిటీగా మార్చడం...

Comments

Popular posts from this blog

అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు

ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ బిల్లును సభ ముందుంచారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ది చేస్తాం

 హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ది చేస్తాం    - శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ 

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ శంకుస్ధాపన

కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో గురువారం సాయంత్రం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణాకు శంకుస్థాపన చేస్తున్న ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. 57   ఎకారాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది.