ఫోర్త్ సిటీలోనూ ఫాక్స్‌కాన్ (Foxconn) పెట్టుబడులు ముఖ్యమంత్రి విజన్ అద్భుతమన్న యాంగ్ లియూ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్ చైర్మన్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ గారికి వివరించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ (Foxconn) సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ (Fox...
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు. 🔹 ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దు. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది. 🔹 ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా ...