ఫోర్త్ సిటీలోనూ ఫాక్స్‌కాన్ (Foxconn) పెట్టుబడులు ముఖ్యమంత్రి విజన్ అద్భుతమన్న యాంగ్ లియూ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్ చైర్మన్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫాక్స్‌కాన్ (Foxconn) చైర్మన్ యాంగ్ లియూ గారికి వివరించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ (Foxconn) సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ (Fox...
future of hyderabad